పోస్ట్‌లు

పొలిటికల్ గేమ్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బిజెపిలో జనసేన విలీనమా.?

చిత్రం
  రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో కొంత బలం పుంజుకోవాలంటే.. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ మంత్రి కాపు రిజర్వేషన్‍ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభంను బిజెపిలో చేర్చుకుని జనసేనను కూడా బిజెపిలో విలీనం చేసుకున్నట్లయితే.. బలమైన రాజకీయ శక్తిగా అవతరించవచ్చని.. బిజెపి అధ్యక్షడు సోము వీర్రాజు ఆశపడుతున్నారట. సిఎం జగన్‍కు రెడ్డి సామాజికవర్గ ఓటర్ల మద్దతు ఉంది. ఆసామాజికవర్గ ఓటర్లు కేవలం 4 నుండి 5శాతం లోపే ఉంటారు. చంద్రబాబుకు కమ్మ సామాజికవర్గ ఓటర్ల మద్దతు ఉంది.. ఆ సామాజికవర్గ ఓటర్లు కూడా కేవలం 4 నుండి 5శాతంలోపే ఉంటారు. రాష్ట్రంలో 22శాతం కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ.. రాజకీయ అధికారం రావటం లేదు. ఈ సారి ఎన్నికలలో చిరంజీవి, పవన్‍ కళ్యాణ్‍, ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర స్థానిక బలమైన కాపు నాయకులను పార్టీలో చేర్చుకుంటే.. ఆ ప్రభావం ఓటర్లలో పనిచేసి రాజకీయ శక్తిగా ఎదగవచ్చనని… సోము వీర్రాజు ఆశపడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతిచ్చిన చిరంజీవి, అమరావతి రాజధానికి మద్దతిస్తున్న జనసేనాధిపతి పవన్‍ కళ్యాణ్‍ను, కాపునాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని ఒక పార్టీలో చేర్చటం సోముకు సాధ్యపడుతుందా…? రాష్ట్ర

ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్టు || One N More

చిత్రం

విశిష్ట సంపర్క్ అభియాన్ - ఇంటింటికి బీజేపీ యాగగిరి గుట్ట మండలం

విశిష్ట సంపర్క్ అభియాన్ - ఇంటింటికి బీజేపీ యాగగిరి గుట్ట మండలం యాదగిరి పల్లి గ్రామంలో ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సుమారు 350 కి పైగా కుటుంబాలను కలవడం జరిగింది. రాత్రి 9 గంటలవరకు జరిగిన ఈ కార్యక్రమంలో సహకరించిన బీజేపీ మండల శాఖ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామస్తులకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు

గంధమల్ల రిజర్వాయరు పనులు ఎజెండా గా ఈ రోజు ప్రభుత్వ విప్ అధ్యక్షతన రెవిన్యూ డివిజన్ కార్యాలయము

గంధమల్ల రిజర్వాయరు పనులు ఎజెండా గా ఈ రోజు ప్రభుత్వ విప్ అధ్యక్షతన రెవిన్యూ డివిజన్ కార్యాలయములో జరిగిన సమీక్ష సమావేశము లో భువనగిరి RDO గారు, గంద మల్ల EE అశోక్ గారు, DEE ఖుర్షిద్ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ లక్ష్మి గారు పాల్గొన్నారు . గంధమల్ల రిజర్వాయిర్ మరియు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కొరకు ఎన్ని ఎకరాలు భూసేకరణ చేయవలసి యున్నది ఇందులో భాగముగా సంపూర్ణముగా గంధమల్ల రిజర్వాయరు కు ముంపుకు గురవుతున్న గంధమల్ల , మామిడికుంట , ఇందిరా నగర్ , తెట్టెకుంట , భీమావారి గూడెం గ్రామాలలో ఎన్ని ఇండ్లు ముంపునకు గురైతున్నాయి వారి కుటుంబాల పునరావసం కొరకు స్థల సేకరణ చేయవలసినది గా నిర్ణయించడం జరిగినది. 1473 ఇండ్లు ముంపునకు గురైతున్నట్లు సమావేశము లో అధికారులు తెలియజేయడం జరిగినది. అందుకు గాను దాదాపు ( 60 ) ఎకరాల స్థలము సేకరించవలెనని నిర్ణయించడం జరిగినది . త్వరితగతిన రిజర్వాయరు కు కావలసిన 1900 ఎకరాలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయుటకు నిర్ణయించడమైనది . డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా రాజాపేట మండలానికి సాగు నీరు అందించడానికి కావలసిన భూ సేకరణ విషయము కూడా చర్చించడము జరిగినది . ఇందులో భాగముగా మొత్తము 139 ఎకరాలు భ

గంధమల్ల-బస్వాపురం రిజర్వాయర్ ముంపు బాధిత రైతులకు ఎకరానికి 50లక్షలు చెల్లించాలి - బీమారం నర్సింహులు

         రిజర్వాయర్ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కోసం ఈ నెల 29న గంధమల్లలో CPI(ML)న్యూ డెమోక్రసీ యాదాద్రి జిల్లా కమిటీ ఆద్వర్యంలో  జరుపుతున్న జిల్లా సదస్సును జయప్రదం చేయాలనీ పార్టీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్,భువనగిరి డివిజన్ కార్యదర్శి బెజాడి కుమార్ లు కోరారు. సదస్సు కరపత్రాలను ఇవాళ గంధమల్లలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బీమారం నర్సింహులు మాట్లాడుతూ వేల ఎకరాల సాగు భూములు,ఇల్లు వాకిలి కోల్పోతున్న బస్వపురం-గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ఎకరానికి 50లక్షలు నష్టపరిహారం ఇవ్వాలనీ, రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఈ రైతులకు ఎకరం భూమి ఇవ్వాలనీ ఆ తర్వాతే ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాలనీ లేని పక్షంలో బాధిత రైతులతో ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంధమల్ల గ్రామ నాయకులు బీమారం నర్సింహులు.,  గ్రామస్తులు N శ్రావణ్, K లాలయ్య R కుమార్ B నర్సింహ S వెంకటేష్ P సురేశ్  N శ్రీను,M భాస్కర్,E కుమార్,నేరేడు స్వామి,M వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు...

డబుల్ బెడ్రూం కాదు కనీసం సింగిల్ బెడ్రూం ఐనా ఈవ్వండి...కల్లూరి

చిత్రం
ఈరోజు తుర్కపల్లి మండలంలోని భీల్యా నాయక్ తండా మరియు చిన్నలక్మపూర్ లో పూరి గుడిసెలకు  కల్లూరి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో  నిరుపేద గిరిజన  కుటుంబాలకు టార్పెఇన్లు అందించారు, ఈకార్యక్రమంలో తెలంగాణ పరిరక్షణ సమితి నాయకుడు భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ కనీస అవసరం ఐనా నివాసంచడానికి ఇల్లు కూడా లేకుండా జీవస్తున సామాన్య ప్రజలకు....కనీసం సింగిల్ బెడ్ రూమ్లు ఐనా నిర్మించాలని ప్రభుత్వంనికి డిమాండ్ చేశారు......tps సభ్యులు పాండు నాయక్,సుధాక్,రమేష్,ముతుకుపల్లీ రవి,ప్రశాంత్,రాజు మరియు గ్రామ యూవకులు పాల్గొన్నారు

గంధమల్ల పెద్దమ్మగడ్డ యూత్

గంధమల్ల పెద్దమ్మగడ్డ యూత్ అధ్యక్షుడు గా సుధగాని కిరణ్ గౌడ్ ఎన్నికయ్యారు