పోస్ట్‌లు

సినిమా న్యూస్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రామ్ గోపాల్ వర్మకు తీవ్ర అనారోగ్యం! disappoint చేస్తున్నా అనేశాడు..!

చిత్రం
  ఈ ప్రపంచంలో దేన్నీ లెక్కచేయను అలాగని తప్పు చేయను.. నేను అనుకున్నదే చేస్తా, నా ఆలోచనలే నాకు బలం అంటూ ఓపెన్‌గా మాట్లాడే  రామ్ గోపాల్ వర్మ   తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని మీడియా వర్గాలు. కరోనాను సైతం లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు కరోనా సోకిందా? లేదా మామూలు అనారోగ్యమేనా అనేది తెలియాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై రియాక్ట్ అయిన వర్మ స్వయంగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. చేతిలో డంబేల్ పట్టుకొని వర్కవుట్ చేస్తూ తన అనారోగ్యం పట్ల వస్తున్న వార్తలపై స్పందించారు వర్మ. ''నేను అనారోగ్యంగా ఉన్నానని, నాకు కోవిడ్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోందని కొందరు సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు. వాళ్లందరినీ డిజప్పాటింట్ చేస్తూ, మీ సంతోషానికి చెక్ పెడుతూ నేను చెప్పేది ఒక్కటే.. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు రూపొందిస్తున్నాను. సూపర్ ఫకింగ్ ఫైన్'' అన్నారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆర్జీవీ స్టైల్‌లోనే కామెంట్స్

పంపు సెట్టు, దున్నడం, అదే పని.. అన్నీ అలాంటి డైలాగ్సే.. శృతిమించిన సుధీర్, శేఖర్ మాస్టర్!

చిత్రం
  బుల్లితెరపై జబర్దస్త్ షో సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతలా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అది నెగెటివిటీ అయినా కావచ్చు పాజిటివ్‌గానైనా కావచ్చు గానీ జబర్దస్త్ అనేది ఓ సంచలనం. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువయ్యాయి, అడల్ట్ కంటెంట్ శృతి మించుతోందని ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సరే.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సుడిగాలి సుధీర్, శేఖర్ మాస్టర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతున్నారంటే ఆశ్చర్యపోన్నక్కర్లేదు. కానీ శేఖర్ మాస్టర్ కూడా వారికి ధీటుగా కౌంటర్స్, సెటైర్స్ వేయడంలో ఆరి తేరిపోయాడు. అసలే ఢీ షోలోనూ ఇలాంటి కంటెంటే ఎక్కువ అవుతోంది. అలా అప్పుడప్పుడు జబర్దస్త్ వేదికపైనా మెరుస్తూ ఉంటాడు. ఇక సుడిగాలి సుధీర్ ప్రతీ స్కిట్‌లో రష్మీని వాడుతుంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మీని కౌంటర్స్ వేయడం, ఆమెను స్కిట్స్‌లో ఇన్వాల్వ్ చేయడం, ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని వాడుకోవడం పరిపాటే. రాబోయే ఎపిసోడ్‌లోనూ రష్మీని బాగానే వాడినట్టు ప్రోమోలో కని

బాహుబలి ముందు `టైగర్` వెనుకడుగు!

చిత్రం
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అన్న క్యూరియాసిటీని ప్రపంచవ్యాప్తంగా రేకెత్తించిన దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి-2తో పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా `బాహుబలి-2` తొలిరోజు `బాక్సాఫీస్ ` కలెక్షన్లకు బాలీవుడ్ బెంబేలెత్తిపోయింది. ఒక దక్షిణాది చిత్రానికి దక్కిన తొలిరోజు కలెక్షన్ల రికార్డును ఎలాగైనా బద్దలు కొట్టాలని కంకణం కట్టుకుంది. అయితే ఈ ఏడాదికి మాత్రం ఆ కలలన్నీ...కల్లలుగానే మిగిలిపోయాయి.  ఇప్పటివరకు విడుదలైన బాలీవుడ్ చిత్రాలేవీ బాహుబలి-2 తొలిరోజు కలెక్షన్ల దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ డిజాస్టర్ మూవీ ట్యూబ్ లైట్ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన 'టైగర్ జిందా హై' చిత్రం కూడా ఆ రికార్డును అధిగమించలేకపోయింది. సల్లూ భాయ్ తాజా చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 5700ల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 'బాహుబలి 2' రికార్డును బద్దలు కొడుతుందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ సల్లూ భాయ్ చిత్రం కేవలం రూ. 33.75 కోట్లు కలెక్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. బాహుబలి-