పంపు సెట్టు, దున్నడం, అదే పని.. అన్నీ అలాంటి డైలాగ్సే.. శృతిమించిన సుధీర్, శేఖర్ మాస్టర్!

 బుల్లితెరపై జబర్దస్త్ షో సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతలా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అది నెగెటివిటీ అయినా కావచ్చు పాజిటివ్‌గానైనా కావచ్చు గానీ జబర్దస్త్ అనేది ఓ సంచలనం. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువయ్యాయి, అడల్ట్ కంటెంట్ శృతి మించుతోందని ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సరే.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సుడిగాలి సుధీర్, శేఖర్ మాస్టర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.



ఇక జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతున్నారంటే ఆశ్చర్యపోన్నక్కర్లేదు. కానీ శేఖర్ మాస్టర్ కూడా వారికి ధీటుగా కౌంటర్స్, సెటైర్స్ వేయడంలో ఆరి తేరిపోయాడు. అసలే ఢీ షోలోనూ ఇలాంటి కంటెంటే ఎక్కువ అవుతోంది. అలా అప్పుడప్పుడు జబర్దస్త్ వేదికపైనా మెరుస్తూ ఉంటాడు.



ఇక సుడిగాలి సుధీర్ ప్రతీ స్కిట్‌లో రష్మీని వాడుతుంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మీని కౌంటర్స్ వేయడం, ఆమెను స్కిట్స్‌లో ఇన్వాల్వ్ చేయడం, ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని వాడుకోవడం పరిపాటే. రాబోయే ఎపిసోడ్‌లోనూ రష్మీని బాగానే వాడినట్టు ప్రోమోలో కనిపిస్తోంది.



సుధీర్ తన స్కిట్‌లో భాగంగా ఏం రష్మీ ఈ మధ్య పొలం పనులకు రావడం మానేశావ్.. సాయంత్రం పంపు సెంటు దగ్గరికి రా అని అదో రకంగా అనడంతో రష్మీ షాక్ అయింది. వెంటనే గెటప్ శ్రీను సుధీర్ బాబాయి వేశంలో వచ్చి..ఏరా ఏం చేస్తున్నావ్.. అని గదమాయిస్తాడు.



ఇక వెంటనే సుధీర్ అందుకుని.. ‘పిట్టకూతకు వచ్చింది కదా రమ్మంటున్నా..హా అదే.. పొలం కోతకు వచ్చింది కదా అందర్నీ పనులోకి రమ్మంటున్నా' అని మాట మార్చేస్తాడు. మధ్యలో శేఖర్ మాస్టర్ అందుకుని ‘దున్నడానికా?..' అని కౌంటర్ వేయడంతో అందరూ ఫక్కున నవ్వేశారు.




వెంటనే గెటప్ శ్రీను అందుకుని.. ‘పొలం పనులకా ఎవర్ని పిలుస్తున్నావ్..' అని సుధీర్‌ను అడిగితే.. ‘ఏముంది.. కనబడినోళ్లనల్లా..హుమ్.. పొలంకొచ్చేయండి సాయంత్రం..' అంటూ వెరైటీ ఎక్స్ ప్రెషన్‌తో చెబుతాడు. వెంటనే రష్మీ ‘ఛీ దరిద్రుడా తూ.. ' అంటూ సుధీర్ పరువుతీసేసింది.



ఇక గెటప్ శ్రీను మళ్లీ అందుకుని.. ‘అలా పిలుస్తావారా?' అంటాడు. ‘ఎంది బాబాయ్ ప్రతీదీ తెలిసినట్టు.. అన్ని నీకే తెలిసినట్టు బిల్డప్ ఇస్తావ్..' అని సుధీర్ ఫైర్ అవుతాడు. అప్పుడు గెటప్ శ్రీను మళ్లీ మాట్లాడుతూ.. ‘ఎన్ని తెలీకపోతే ఈ స్టేజ్‌లో ఉంటాను.. నీ కోసం నేను పెళ్లి చేసుకోకుండా చిన్నప్పటి నుంచి..' అంటూ కాస్త గ్యాప్ ఇస్తాడు. ఇక ఈ సందులో శేఖర్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చి.. ‘అప్పటి నుంచి అదే పనిలో ఉన్నావా?' అంటూ దారుణమైన పంచ్ వేస్తాడు. ఇలా మొత్తంగా ఈ ప్రోమోలో అన్నీ డబుల్ మీనింగ్ డైలాగ్సే నిండిపోయి ఉన్నాయి.



follow me on YouTube : 

https://www.youtube.com/channel/UCdgO7s5eyybPlSsELLMnFwg






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాహుబలి ముందు `టైగర్` వెనుకడుగు!

ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు...మోదీ సర్కారు ఇచ్చే రుణంతో లక్షల్లో ఆదాయం...!!