పోస్ట్‌లు

సమాజ సేవ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అదీ ఆత్మగౌరవం అంటే, ఇదీ ఆత్మాభిమానం అంటే.

ఎంతోమందికి విద్యా దానం చేసిన ఓ టీచర్ రిటైర్ అయిన తర్వాత భర్త, బిడ్డల నిరాదరణకు గురై బిచ్చగత్తెగా మారి పిచ్చిదానిలా వీధుల్లో తిరుగుతుంటే ఆమె వద్ద చదువుకున్న విద్యార్థులు బిడ్డలకంటే ప్రేమగా ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. మా ఇంటికి రమ్మంటూ ప్రాధేయపడ్డారు. ఆర్థిక సహాయం చేస్తామంటూ అర్థించారు. అయినా ఆ టీచర్ వినలేదు. తన ఖర్మకు తనను ఇలాగే వదిలేయమని ప్రాధేయపడింది. ఆమె దగ్గర చదువుకుని ఉన్నత స్థాయికి పోయిన విద్యార్థులు బలవంతంగా తమ టీచర్ ను వృద్ధాశ్రమానికైనా తరలించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. కేరళలో ఒక టీచర్ కన్నీటి గాధ ఇది. వృద్ధాప్యంలో బిడ్డలు తల్లిదండ్రులను వదిలేసినా, ఫేస్ బుక్ లో తమ టీచర్ దుస్థితిని చూసిన విద్యార్థులు కన్నబిడ్డలకంటే ఎక్కువగా ప్రేమ చూపి తమ గురుభక్తిని నిరూపించుకున్నారు. కేరళలోని తంపనూరు రైల్వే స్టేషన్లో ఈనెల 5వతేదీన విద్య అనే ఓ యువతి చిరిగిన గుడ్డలు, తైల సంస్కారం లేని తలతో రైల్వే స్టేషన్ ముందు బిచ్చమెత్తుకుంటున్న ఓ వృద్ధురాలిని చూసింది. ఆకలిగా ఉన్నావా అని అడిగితే లేదంటూ ఆ వృద్ధురాలు సమాధానం చెప్పింది. విద్య ఆమెకు ఆకలి లేదన్నా ఆమె పరిస్థితి చూసి టిఫిన్ తెచ్చి ఇచ్చింది. తర్వాత ఆమ