బిజెపిలో జనసేన విలీనమా.?








 రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో కొంత బలం పుంజుకోవాలంటే.. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ మంత్రి కాపు రిజర్వేషన్‍ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభంను బిజెపిలో చేర్చుకుని జనసేనను కూడా బిజెపిలో విలీనం చేసుకున్నట్లయితే.. బలమైన రాజకీయ శక్తిగా అవతరించవచ్చని.. బిజెపి అధ్యక్షడు సోము వీర్రాజు ఆశపడుతున్నారట. సిఎం జగన్‍కు రెడ్డి సామాజికవర్గ ఓటర్ల మద్దతు ఉంది. ఆసామాజికవర్గ ఓటర్లు కేవలం 4 నుండి 5శాతం లోపే ఉంటారు. చంద్రబాబుకు కమ్మ సామాజికవర్గ ఓటర్ల మద్దతు ఉంది.. ఆ సామాజికవర్గ ఓటర్లు కూడా కేవలం 4 నుండి 5శాతంలోపే ఉంటారు. రాష్ట్రంలో 22శాతం కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ.. రాజకీయ అధికారం రావటం లేదు. ఈ సారి ఎన్నికలలో చిరంజీవి, పవన్‍ కళ్యాణ్‍, ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర స్థానిక బలమైన కాపు నాయకులను పార్టీలో చేర్చుకుంటే.. ఆ ప్రభావం ఓటర్లలో పనిచేసి రాజకీయ శక్తిగా ఎదగవచ్చనని… సోము వీర్రాజు ఆశపడుతున్నారు.


మూడు రాజధానులకు మద్దతిచ్చిన చిరంజీవి, అమరావతి రాజధానికి మద్దతిస్తున్న జనసేనాధిపతి పవన్‍ కళ్యాణ్‍ను, కాపునాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని ఒక పార్టీలో చేర్చటం సోముకు సాధ్యపడుతుందా…? రాష్ట్రంలో 22 శాతం ఉన్న కాపు ఓటర్లను ఐక్యంచేసి మిగతా కులాల ఓటర్లలో కొంత శాతం ఓటర్లను ఆకర్షించగలిగితే.. అధికారంలోకి వచ్చినా..రాకపోయినా.. బలమైన రాజకీయ శక్తిగా ఎదగవచ్చునని సోము వీర్రాజు భావిస్తున్నప్పటికీ… మూడు రాజధానులకు మద్దతిచ్చిన చిరంజీవిపై మెజార్టీఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తరువాత కాంగ్రెస్‍లో విలీనం చేసినప్పుడు మెజార్టీ కాపుఓటర్లు వ్యతిరేకించారు. హైదరాబాదుకే పరిమితమయిన చిరంజీవిని బిజెపిలో చేర్చుకున్నంత మాత్రాన.. కాపు సామాజికవర్గ ఓటర్లు అందరూ మద్దతిస్తారని అనుకోవటం పగటి కలగానే మిగిలిపోతుందంటున్నారు కాపు సామాజికవర్గ నేతలు.


బలమైన రాజకీయ శక్తిగా పవన్‍ కళ్యాణ్‍ ఎదగబోతున్న నేపధ్యంలో ఆయనపై ఎవరెవరు ఏ విధంగా ఒత్తిడి తెస్తున్నారు. ఆ ప్రభావం పవన్‍పై పనిచేసిందా.. జనసేన పార్టీని ఏ పార్టీలో వీలినం చేసే ప్రసక్తే లేదని.. (అప్పట్లో నరేంద్ర మోడీ, అమిత్‍షాలు కోరినప్పటికీ) ఇంతకు ముందు పవన్‍ ప్రకటించారు. జనాకర్షణ నేతగా పేరున్న పవన్‍ కళ్యాణ్‍ మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్న బిజెపిలో విలీనం చేసే ప్రసక్తే ఉండదు.. ఆ పార్టీతో ఇప్పటికే పొత్తు పెట్టుకోవటం దురదృష్టకరమని ముందు ముందు మార్పులు చేర్పులు జరగవచ్చని జనసేన సీనియర్‍ నాయకులు చెబుతున్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాహుబలి ముందు `టైగర్` వెనుకడుగు!

ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు...మోదీ సర్కారు ఇచ్చే రుణంతో లక్షల్లో ఆదాయం...!!