గంధమల్ల రిజర్వాయరు పనులు ఎజెండా గా ఈ రోజు ప్రభుత్వ విప్ అధ్యక్షతన రెవిన్యూ డివిజన్ కార్యాలయము

గంధమల్ల రిజర్వాయరు పనులు ఎజెండా గా ఈ రోజు ప్రభుత్వ విప్ అధ్యక్షతన రెవిన్యూ డివిజన్ కార్యాలయములో జరిగిన సమీక్ష సమావేశము లో భువనగిరి RDO గారు, గంద మల్ల EE అశోక్ గారు, DEE ఖుర్షిద్ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ లక్ష్మి గారు పాల్గొన్నారు . గంధమల్ల రిజర్వాయిర్ మరియు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కొరకు ఎన్ని ఎకరాలు భూసేకరణ చేయవలసి యున్నది ఇందులో భాగముగా సంపూర్ణముగా గంధమల్ల రిజర్వాయరు కు ముంపుకు గురవుతున్న గంధమల్ల , మామిడికుంట , ఇందిరా నగర్ , తెట్టెకుంట , భీమావారి గూడెం గ్రామాలలో ఎన్ని ఇండ్లు ముంపునకు గురైతున్నాయి వారి కుటుంబాల పునరావసం కొరకు స్థల సేకరణ చేయవలసినది గా నిర్ణయించడం జరిగినది. 1473 ఇండ్లు ముంపునకు గురైతున్నట్లు సమావేశము లో అధికారులు తెలియజేయడం జరిగినది. అందుకు గాను దాదాపు ( 60 ) ఎకరాల స్థలము సేకరించవలెనని నిర్ణయించడం జరిగినది . త్వరితగతిన రిజర్వాయరు కు కావలసిన 1900 ఎకరాలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయుటకు నిర్ణయించడమైనది . డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా రాజాపేట మండలానికి సాగు నీరు అందించడానికి కావలసిన భూ సేకరణ విషయము కూడా చర్చించడము జరిగినది . ఇందులో భాగముగా మొత్తము 139 ఎకరాలు భూమిని గంధమల్ల , సింగారం , పాముకుంట , నర్సాపురం గ్రామాలలో సేకరించవలసి యున్నది .ఇందుకు గాను సింగారం గ్రామము లో 40 ఎకరాలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీచేసినట్లు SDC విజయ లక్ష్మి గారు తెలియజేసారు , త్వరలోనే పాముకుంట , గంధమల్ల , గ్రామాలకు కూడా జారీచేస్తామని , నర్సాపురం అటవీ భూములను గతము లోనే కొనుగోలు చేసినట్లు చెప్పినారు. ఈ డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా రాజాపేట మండలము లోని 2000 ఎకరాలకు సాగు నీరు అందుతుందని EE అశోక్ గారు తెలియజేసారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాహుబలి ముందు `టైగర్` వెనుకడుగు!

ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు...మోదీ సర్కారు ఇచ్చే రుణంతో లక్షల్లో ఆదాయం...!!