గంధమల్ల-బస్వాపురం రిజర్వాయర్ ముంపు బాధిత రైతులకు ఎకరానికి 50లక్షలు చెల్లించాలి - బీమారం నర్సింహులు

         రిజర్వాయర్ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కోసం ఈ నెల 29న గంధమల్లలో CPI(ML)న్యూ డెమోక్రసీ యాదాద్రి జిల్లా కమిటీ ఆద్వర్యంలో  జరుపుతున్న జిల్లా సదస్సును జయప్రదం చేయాలనీ పార్టీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్,భువనగిరి డివిజన్ కార్యదర్శి బెజాడి కుమార్ లు కోరారు. సదస్సు కరపత్రాలను ఇవాళ గంధమల్లలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బీమారం నర్సింహులు మాట్లాడుతూ వేల ఎకరాల సాగు భూములు,ఇల్లు వాకిలి కోల్పోతున్న బస్వపురం-గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ఎకరానికి 50లక్షలు నష్టపరిహారం ఇవ్వాలనీ, రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఈ రైతులకు ఎకరం భూమి ఇవ్వాలనీ ఆ తర్వాతే ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాలనీ లేని పక్షంలో బాధిత రైతులతో ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంధమల్ల గ్రామ నాయకులు బీమారం నర్సింహులు.,  గ్రామస్తులు N శ్రావణ్, K లాలయ్య R కుమార్ B నర్సింహ S వెంకటేష్ P సురేశ్  N శ్రీను,M భాస్కర్,E కుమార్,నేరేడు స్వామి,M వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాహుబలి ముందు `టైగర్` వెనుకడుగు!

ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు...మోదీ సర్కారు ఇచ్చే రుణంతో లక్షల్లో ఆదాయం...!!