పోస్ట్‌లు

జులై, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

గంధమల్ల రిజర్వాయరు పనులు ఎజెండా గా ఈ రోజు ప్రభుత్వ విప్ అధ్యక్షతన రెవిన్యూ డివిజన్ కార్యాలయము

గంధమల్ల రిజర్వాయరు పనులు ఎజెండా గా ఈ రోజు ప్రభుత్వ విప్ అధ్యక్షతన రెవిన్యూ డివిజన్ కార్యాలయములో జరిగిన సమీక్ష సమావేశము లో భువనగిరి RDO గారు, గంద మల్ల EE అశోక్ గారు, DEE ఖుర్షిద్ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ లక్ష్మి గారు పాల్గొన్నారు . గంధమల్ల రిజర్వాయిర్ మరియు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కొరకు ఎన్ని ఎకరాలు భూసేకరణ చేయవలసి యున్నది ఇందులో భాగముగా సంపూర్ణముగా గంధమల్ల రిజర్వాయరు కు ముంపుకు గురవుతున్న గంధమల్ల , మామిడికుంట , ఇందిరా నగర్ , తెట్టెకుంట , భీమావారి గూడెం గ్రామాలలో ఎన్ని ఇండ్లు ముంపునకు గురైతున్నాయి వారి కుటుంబాల పునరావసం కొరకు స్థల సేకరణ చేయవలసినది గా నిర్ణయించడం జరిగినది. 1473 ఇండ్లు ముంపునకు గురైతున్నట్లు సమావేశము లో అధికారులు తెలియజేయడం జరిగినది. అందుకు గాను దాదాపు ( 60 ) ఎకరాల స్థలము సేకరించవలెనని నిర్ణయించడం జరిగినది . త్వరితగతిన రిజర్వాయరు కు కావలసిన 1900 ఎకరాలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయుటకు నిర్ణయించడమైనది . డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా రాజాపేట మండలానికి సాగు నీరు అందించడానికి కావలసిన భూ సేకరణ విషయము కూడా చర్చించడము జరిగినది . ఇందులో భాగముగా మొత్తము 139 ఎకరాలు భ

తొలిఏకాదశి విశేషం ఏమిటంటే...!!

చిత్రం
   తొలిఏకాదశి.ఆషాడ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలిఏకాదశి అంటారు.తొలిఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని.ఈ రోజున ఆ పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటారు. జీవుల కర్మఫలాల గురించి ఆలోచించి, నిద్ర లేవగానే ఎవరి కర్మలను బట్టి వారికి ఏ జన్మను ప్రసాదించాలో నిర్ణయిస్తారు.కాబట్టి మనకు కావలసిన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం అన్ని ఎవరికి ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ, మన తప్పుఒప్పులకు లెక్కలు వేయడానికి యోగనిద్రలోకి ఉపక్రమించే రోజు ఈ తొలిఏకాదశి. ఈ రోజున ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమాలు: ** బ్రహ్మీ మూహుర్తంలో నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. **దగ్గరలో ఉన్న నదిలో నదీస్నానం ఆచరించాలి.లేదా కనీసం బావి స్నానం అన్నా చేయాలి. **మనసా, వాచా అన్నింటిని శుద్ధి చేసుకుని, పూజగదిని శుభ్రం చేసుకుని భగవంతుని అలంకరించి శక్తి మేరకు ధూప, దీప, నైవేధ్యాలను, హారతిని సమర్పించి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. అయ్యా! ఈ రోజు నేను ఉపవాస వ్రతం చేస్తూ, మౌనవ్రతం చేస్తాను.నీ నామసంకీర్తనం తప్ప నా నోట కానీ, మనస్సులో కాని వేరే అలోచన రానివ్వను అని భగవ

గంధమల్ల-బస్వాపురం రిజర్వాయర్ ముంపు బాధిత రైతులకు ఎకరానికి 50లక్షలు చెల్లించాలి - బీమారం నర్సింహులు

         రిజర్వాయర్ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కోసం ఈ నెల 29న గంధమల్లలో CPI(ML)న్యూ డెమోక్రసీ యాదాద్రి జిల్లా కమిటీ ఆద్వర్యంలో  జరుపుతున్న జిల్లా సదస్సును జయప్రదం చేయాలనీ పార్టీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్,భువనగిరి డివిజన్ కార్యదర్శి బెజాడి కుమార్ లు కోరారు. సదస్సు కరపత్రాలను ఇవాళ గంధమల్లలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బీమారం నర్సింహులు మాట్లాడుతూ వేల ఎకరాల సాగు భూములు,ఇల్లు వాకిలి కోల్పోతున్న బస్వపురం-గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ఎకరానికి 50లక్షలు నష్టపరిహారం ఇవ్వాలనీ, రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఈ రైతులకు ఎకరం భూమి ఇవ్వాలనీ ఆ తర్వాతే ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాలనీ లేని పక్షంలో బాధిత రైతులతో ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంధమల్ల గ్రామ నాయకులు బీమారం నర్సింహులు.,  గ్రామస్తులు N శ్రావణ్, K లాలయ్య R కుమార్ B నర్సింహ S వెంకటేష్ P సురేశ్  N శ్రీను,M భాస్కర్,E కుమార్,నేరేడు స్వామి,M వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు...

డబుల్ బెడ్రూం కాదు కనీసం సింగిల్ బెడ్రూం ఐనా ఈవ్వండి...కల్లూరి

చిత్రం
ఈరోజు తుర్కపల్లి మండలంలోని భీల్యా నాయక్ తండా మరియు చిన్నలక్మపూర్ లో పూరి గుడిసెలకు  కల్లూరి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో  నిరుపేద గిరిజన  కుటుంబాలకు టార్పెఇన్లు అందించారు, ఈకార్యక్రమంలో తెలంగాణ పరిరక్షణ సమితి నాయకుడు భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ కనీస అవసరం ఐనా నివాసంచడానికి ఇల్లు కూడా లేకుండా జీవస్తున సామాన్య ప్రజలకు....కనీసం సింగిల్ బెడ్ రూమ్లు ఐనా నిర్మించాలని ప్రభుత్వంనికి డిమాండ్ చేశారు......tps సభ్యులు పాండు నాయక్,సుధాక్,రమేష్,ముతుకుపల్లీ రవి,ప్రశాంత్,రాజు మరియు గ్రామ యూవకులు పాల్గొన్నారు

యాదాద్రి దేవస్థానం నమూనా

చిత్రం
 యాదాద్రి దేవస్థానం నమూనా ను సిద్ధం చేశారు  ఈ సందర్భంగా సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మాట్లాడుతూ.. ప్రభుత్వం యాదాద్రి దేవాలయాన్ని ప్రతిష్టాత్మకంగా  తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు

గంధమల్ల పెద్దమ్మగడ్డ యూత్

గంధమల్ల పెద్దమ్మగడ్డ యూత్ అధ్యక్షుడు గా సుధగాని కిరణ్ గౌడ్ ఎన్నికయ్యారు