తొలిఏకాదశి విశేషం ఏమిటంటే...!!

   తొలిఏకాదశి.ఆషాడ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలిఏకాదశి అంటారు.తొలిఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని.ఈ రోజున ఆ పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటారు. జీవుల కర్మఫలాల గురించి ఆలోచించి, నిద్ర లేవగానే ఎవరి కర్మలను బట్టి వారికి ఏ జన్మను ప్రసాదించాలో నిర్ణయిస్తారు.కాబట్టి మనకు కావలసిన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం అన్ని ఎవరికి ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ, మన తప్పుఒప్పులకు లెక్కలు వేయడానికి యోగనిద్రలోకి ఉపక్రమించే రోజు ఈ తొలిఏకాదశి.

ఈ రోజున ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమాలు:
** బ్రహ్మీ మూహుర్తంలో నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి.
**దగ్గరలో ఉన్న నదిలో నదీస్నానం ఆచరించాలి.లేదా కనీసం బావి స్నానం అన్నా చేయాలి.
**మనసా, వాచా అన్నింటిని శుద్ధి చేసుకుని, పూజగదిని శుభ్రం చేసుకుని భగవంతుని అలంకరించి శక్తి మేరకు ధూప, దీప, నైవేధ్యాలను, హారతిని సమర్పించి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి.

అయ్యా! ఈ రోజు నేను ఉపవాస వ్రతం చేస్తూ, మౌనవ్రతం చేస్తాను.నీ నామసంకీర్తనం తప్ప నా నోట కానీ, మనస్సులో కాని వేరే అలోచన రానివ్వను అని భగవంతుని ధ్యానంలో కాలం గడపాలి.
**సాయంత్రం దీపారాధన చేసి రాత్రంతా కీర్తనలు చేసి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆరు గంటల లోపు ప్రసాదం స్వీకరించాలి.

భగవంతుడు యోగనిద్రలో ఉంటారు కదా, మనము చేసే పూజలు ఎవరికి చేరతాయి అనే అనుమానం మీరు పెట్టుకోనక్కరలేదు.
పరమాత్ముడికి ఐదు విభూతులు అని పేరు.

అందులో
మొదటిది వైకుంఠంలో ఉండే ఆ శ్రీమహవిష్ణువుది పర అంటారు.ఈ స్వామి యోగనిద్రలోకి వెళ్ళి మన తప్పుఒప్పులను లెక్కలువేసి మన తదుపరి జన్మను నిర్ణయించేది.
రెండోది క్షీరసాగరంలో వాసుకి మీద శయనించి ఉండే ఆ పరమాత్ముడిది, దీనినే వ్యూహం అంటారు.
మూడోది అవతారాలలో ఉండే స్వామి అంటే రాముడు, కృష్ణుడు..వీరిని విభవము అంటారు.
నాలుగోది, సర్వ జీవుల హృదయాలలో ఉండే స్వామిని అంతర్యామి అంటారు.
ఐదోది మనము రోజు ఇంట్లో పూజించే స్వామి, అర్చ్యామూర్తీ అంటారు.

మనము విన్నవించే విన్నపాలు, మన పూజలు స్వీకరించేది మన ఇంట్లో ఉండే అర్చ్యామూర్తీ.కనుక నిస్సందేహంగా ఆయనను పూజించి మీరు తెలిసితెలియక చేసిన తప్పులకు ఆయనను క్షమించమని మనస్పూర్తిగా వేడుకుని, మంచి జన్మను ప్రసాదించమని వేడుకోండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాహుబలి ముందు `టైగర్` వెనుకడుగు!

ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు...మోదీ సర్కారు ఇచ్చే రుణంతో లక్షల్లో ఆదాయం...!!