పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్.. 14 మందిలో ఐదుగురు యాంకర్లు!

చిత్రం
బిగ్ సీజన్ 4 ఎప్పుడన్నదానిపై క్లారిటీ ఇస్తూ స్టార్ మా అఫీషియల్ ప్రోమో విడుదల చేయడంతో ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6 సాయత్రం 6 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానుంది. తెలుగు టెలివిజన్‌లోఅత్యుత్తమమైన రేటింగ్స్ సాధించి వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అదిపెద్ద నాన్ ఫిక్షన్ షో బిగ్ బాస్‌ను ఈసారి వినూత్న తరహాలో అందించనున్నారు. వంద రోజులకు పైగా బుల్లితెర అభిమానులకు వినోదాన్ని పంచనున్నారు. అయితే ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇక సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదానికి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా నోయల్, టీవీ 9 దేవి నాగవల్లి, రఘు మాస్టర్, దేత్తడి హారిక తదితరులు పేర్లు గట్టిగా వినిస్తుండగా.. రీసెంట్‌గా 14 మందితో కూడి లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది 1. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి (TV9 News Presenter Devi) 2. యాంకర్ లాస్య మంజునాథ్ (anchor lasya manjunath) 3. జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash) 4. గంగవ్వ (YouTube Gangavva) 5. కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్ (Amma Rajasekhar) 6. సింగర్ నోయల్

అయోధ్యపై వ్యాఖ్యలు.. చిక్కుల్లో అసదుద్దీన్?

చిత్రం
  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వీరేశ్ శాండిల్య ఈ పిల్ ను దాఖలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంపై ఓవైసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ హాజరుపై ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదని వ్యాఖ్యానించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండేదని.. ఉందని.. ఖచ్చితంగా ఉంటుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. చరిత్రను ఎవరూ మార్చలేరంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.   రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓ వర్గం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం రాజ్యాంగ విరుద్దం అంటూ గతంలో విమర్శించారు. ఆ తర్వాత ఈనెల 30న ఓ చానెల్ డిబేట్ లో పాల్గొన్న అసదుద్దీన్ సుప్రీం కోర్టు పవిత్రతను - విజ్ఞతను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ పిటీషనర్ ఓ పిల్ దాఖలు చేశారు. దీనిపై త్వరలోనే సుప్రీంల

RGV ఖతమ్.. కథ కంచికేనా?

చిత్రం
    ఆర్జీవీ కథ కంచికేనా? వివాదాలతో ప్రచారం ముగిసినట్టేనా? ఆయన సగం కథలు జనాలకు విసుగు పుట్టిస్తున్నాయా? ఇక ఆయన పప్పులు ఉడకడం కష్టమేనా? అంటే అవుననే చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు అంతా నా ఇష్టం! అన్నట్టే నాటకమాడినా ఇప్పుడాయనను పట్టించుకునేవాళ్లే కరువయ్యారు ఇప్పటికే సగం కథ ముగిసింది. ఔట్ డేటెడ్ డైరెక్టర్ గా తయారై భారతీయ సంస్కృతిని మంట కలిపాడన్న అపపృధ వచ్చి పడింది. అసలు మన కల్చర్ కి సంబంధం లేని పిచ్చి సినిమాలు తీస్తూ పిచ్చి ట్వీట్లు పెడుతూ మీడియా అటెన్షన్ ని తనవైపు తిప్పుకుని టీఆర్పీల కక్కుర్తిని క్యాష్ చేసుకుంటున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన సినిమా రిలీజవుతోంది అంటే అన్ని టీవీ చానెళ్ల స్టూడియోలకు ఎగేసుకుని వెళుతున్నాడు. ఇక యాంకర్ ప్రశ్నలకు ఆర్జీవీ వెకిలి సమాధానాలు.. వగైరా వగైరా చానెల్ రేటింగుల్ని పెంచినా జనాలకు మాత్రం నచ్చడం లేదు. ఇటీవల ఆయన ప్రచారంలో పిచ్చి పీక్స్ కు చేరుకుంది. ఎంతగా అంటే.. చానెల్ లైవ్ కి వచ్చి కాలర్స్ ముందే యాంకర్ ని టీజ్ చేస్తున్నాడు. లైవ్ లోనే సెల్ లో పోర్న్ చూస్తున్నా అని చెప్పే వరకూ దిగజారాడు. ఇవన్నీ టీవీలోళ్లు ప్రమోట్ చేయడం చూస్తున్నదే. అయితే ఉన్నట్టుండి చానెళ్ల వా

బిగ్‌బాస్ సీజన్ 4లో ఈ సారి ఏయే మార్పులు ఉండబోతున్నాయంటే..!

చిత్రం
  కరోనా మహామ్మారి  కారణంగా ఈ సారి తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని బిగ్‌బాస్ లవర్స్ కాస్తంత అనుమానాలు వ్యక్తం చేసారు. తాజాగా ఈ షోలో భారీ మార్పులకు బిగ్‌బాస్ నిర్వాహకులు శ్రీకారం చుట్టారు.   ఈ సారి తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని బిగ్‌బాస్ లవర్స్ కాస్తంత అనుమానాలు వ్యక్తం చేసారు. కానీ వారందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. అంతేకాదు షోను హోస్ట్ చేసే నాగార్జున కూడా బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రోమోలో కూడా పాల్గొన్నాడు. నాగార్జున నటించిన ఈ ప్రోమో త్వరలో ప్రసారం కానుంది. ఆ సంగతి పక్కనపెడితే.. కోవిడ్ 19 కారణంగా బిగ్‌బాస్ సీజన్ 4 ఉండబోదన్నది ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో బిగ్ బాస్ షో షూటింగ్‌ను ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున స్టార్ట్ చేసి.. 30 నుంచి రెగ్యులర్‌గా  ఈ షోను  ప్రసారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు స్టార్ మా నిర్వాహకులు. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్‌కు కరోనా టెస్టులు నిర్వహించి తర్వాత పూర్తిగా ఆరోగ్యం ఉన్నారని డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత హౌస్‌లో పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ

రామ్ గోపాల్ వర్మకు తీవ్ర అనారోగ్యం! disappoint చేస్తున్నా అనేశాడు..!

చిత్రం
  ఈ ప్రపంచంలో దేన్నీ లెక్కచేయను అలాగని తప్పు చేయను.. నేను అనుకున్నదే చేస్తా, నా ఆలోచనలే నాకు బలం అంటూ ఓపెన్‌గా మాట్లాడే  రామ్ గోపాల్ వర్మ   తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని మీడియా వర్గాలు. కరోనాను సైతం లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు కరోనా సోకిందా? లేదా మామూలు అనారోగ్యమేనా అనేది తెలియాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై రియాక్ట్ అయిన వర్మ స్వయంగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. చేతిలో డంబేల్ పట్టుకొని వర్కవుట్ చేస్తూ తన అనారోగ్యం పట్ల వస్తున్న వార్తలపై స్పందించారు వర్మ. ''నేను అనారోగ్యంగా ఉన్నానని, నాకు కోవిడ్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోందని కొందరు సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు. వాళ్లందరినీ డిజప్పాటింట్ చేస్తూ, మీ సంతోషానికి చెక్ పెడుతూ నేను చెప్పేది ఒక్కటే.. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు రూపొందిస్తున్నాను. సూపర్ ఫకింగ్ ఫైన్'' అన్నారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆర్జీవీ స్టైల్‌లోనే కామెంట్స్

బిజెపిలో జనసేన విలీనమా.?

చిత్రం
  రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో కొంత బలం పుంజుకోవాలంటే.. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ మంత్రి కాపు రిజర్వేషన్‍ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభంను బిజెపిలో చేర్చుకుని జనసేనను కూడా బిజెపిలో విలీనం చేసుకున్నట్లయితే.. బలమైన రాజకీయ శక్తిగా అవతరించవచ్చని.. బిజెపి అధ్యక్షడు సోము వీర్రాజు ఆశపడుతున్నారట. సిఎం జగన్‍కు రెడ్డి సామాజికవర్గ ఓటర్ల మద్దతు ఉంది. ఆసామాజికవర్గ ఓటర్లు కేవలం 4 నుండి 5శాతం లోపే ఉంటారు. చంద్రబాబుకు కమ్మ సామాజికవర్గ ఓటర్ల మద్దతు ఉంది.. ఆ సామాజికవర్గ ఓటర్లు కూడా కేవలం 4 నుండి 5శాతంలోపే ఉంటారు. రాష్ట్రంలో 22శాతం కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ.. రాజకీయ అధికారం రావటం లేదు. ఈ సారి ఎన్నికలలో చిరంజీవి, పవన్‍ కళ్యాణ్‍, ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర స్థానిక బలమైన కాపు నాయకులను పార్టీలో చేర్చుకుంటే.. ఆ ప్రభావం ఓటర్లలో పనిచేసి రాజకీయ శక్తిగా ఎదగవచ్చనని… సోము వీర్రాజు ఆశపడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతిచ్చిన చిరంజీవి, అమరావతి రాజధానికి మద్దతిస్తున్న జనసేనాధిపతి పవన్‍ కళ్యాణ్‍ను, కాపునాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని ఒక పార్టీలో చేర్చటం సోముకు సాధ్యపడుతుందా…? రాష్ట్ర

ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు...మోదీ సర్కారు ఇచ్చే రుణంతో లక్షల్లో ఆదాయం...!!

చిత్రం
  కేంద్ర ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన ఎంతో మంది నిరుద్యోగుల కోసం ఆర్థిక సహాయంతో స్వయం ఉపాధి కల్పించేలా కేంద్రం పలు పథకాలు చేపట్టింది. వీటి ద్వారా ఉపాధి కల్పించేలా ప్రణాళికలను తయారు చేసింది. అయతే వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు యువతరం పై ఉంది. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన ఎంతో మంది నిరుద్యోగుల కోసం ఆర్థిక సహాయంతో స్వయం ఉపాధి కల్పించేలా కేంద్రం పలు పథకాలు చేపట్టింది. వీటి ద్వారా ఉపాధి కల్పించేలా ప్రణాళికలను తయారు చేసింది. అయతే వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు యువతరం పై ఉంది. కేంద్ర సహకారంతో చేసుకునే వ్యాపారాల్లో మిల్ డెయిరీ కూడా ఒకటి.కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని పనులు నిలిచిపోయినప్పటికీ, పాలు మరియు పాల ఉత్పత్తుల డిమాండ్, ధర మరియు సరఫరాలో మాత్రం ఏ మాత్రం కొరత కనబడలేదు. మరోవైపు, పశుసంవర్ధకతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులు పాల డెయిరీని ప్రారంభించవచ్చు. డెయిరీని చిన్న పెట్టుబడితో ప్రా

పంపు సెట్టు, దున్నడం, అదే పని.. అన్నీ అలాంటి డైలాగ్సే.. శృతిమించిన సుధీర్, శేఖర్ మాస్టర్!

చిత్రం
  బుల్లితెరపై జబర్దస్త్ షో సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతలా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అది నెగెటివిటీ అయినా కావచ్చు పాజిటివ్‌గానైనా కావచ్చు గానీ జబర్దస్త్ అనేది ఓ సంచలనం. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువయ్యాయి, అడల్ట్ కంటెంట్ శృతి మించుతోందని ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సరే.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సుడిగాలి సుధీర్, శేఖర్ మాస్టర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతున్నారంటే ఆశ్చర్యపోన్నక్కర్లేదు. కానీ శేఖర్ మాస్టర్ కూడా వారికి ధీటుగా కౌంటర్స్, సెటైర్స్ వేయడంలో ఆరి తేరిపోయాడు. అసలే ఢీ షోలోనూ ఇలాంటి కంటెంటే ఎక్కువ అవుతోంది. అలా అప్పుడప్పుడు జబర్దస్త్ వేదికపైనా మెరుస్తూ ఉంటాడు. ఇక సుడిగాలి సుధీర్ ప్రతీ స్కిట్‌లో రష్మీని వాడుతుంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మీని కౌంటర్స్ వేయడం, ఆమెను స్కిట్స్‌లో ఇన్వాల్వ్ చేయడం, ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని వాడుకోవడం పరిపాటే. రాబోయే ఎపిసోడ్‌లోనూ రష్మీని బాగానే వాడినట్టు ప్రోమోలో కని