RGV ఖతమ్.. కథ కంచికేనా?

 





 ఆర్జీవీ కథ కంచికేనా? వివాదాలతో ప్రచారం ముగిసినట్టేనా? ఆయన సగం కథలు జనాలకు విసుగు పుట్టిస్తున్నాయా? ఇక ఆయన పప్పులు ఉడకడం కష్టమేనా? అంటే అవుననే చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు అంతా నా ఇష్టం! అన్నట్టే నాటకమాడినా ఇప్పుడాయనను పట్టించుకునేవాళ్లే కరువయ్యారు


ఇప్పటికే సగం కథ ముగిసింది. ఔట్ డేటెడ్ డైరెక్టర్ గా తయారై భారతీయ సంస్కృతిని మంట కలిపాడన్న అపపృధ వచ్చి పడింది. అసలు మన కల్చర్ కి సంబంధం లేని పిచ్చి సినిమాలు తీస్తూ పిచ్చి ట్వీట్లు పెడుతూ మీడియా అటెన్షన్ ని తనవైపు తిప్పుకుని టీఆర్పీల కక్కుర్తిని క్యాష్ చేసుకుంటున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన సినిమా రిలీజవుతోంది అంటే అన్ని టీవీ చానెళ్ల స్టూడియోలకు ఎగేసుకుని వెళుతున్నాడు. ఇక యాంకర్ ప్రశ్నలకు ఆర్జీవీ వెకిలి సమాధానాలు.. వగైరా వగైరా చానెల్ రేటింగుల్ని పెంచినా జనాలకు మాత్రం నచ్చడం లేదు.



ఇటీవల ఆయన ప్రచారంలో పిచ్చి పీక్స్ కు చేరుకుంది. ఎంతగా అంటే.. చానెల్ లైవ్ కి వచ్చి కాలర్స్ ముందే యాంకర్ ని టీజ్ చేస్తున్నాడు. లైవ్ లోనే సెల్ లో పోర్న్ చూస్తున్నా అని చెప్పే వరకూ దిగజారాడు. ఇవన్నీ టీవీలోళ్లు ప్రమోట్ చేయడం చూస్తున్నదే. అయితే ఉన్నట్టుండి చానెళ్ల వాళ్లలోనూ ఆర్జీవీకి క్రేజు తగ్గడంపై ట్విట్టర్ లోనూ డిబేట్ నడుస్తోంది. ట్విట్టర్ లో అతడికి నెగెటివ్ మార్స్ వస్తున్నాయి ని చెబుతున్నారు. మొన్న ఆ మధ్య అతని స్టూడియో మీద కి స్టూడెండ్స్ వెళ్లి గలాటా చేస్తే సైలెంటుగా దాక్కొని బయపడి పోయాడనే విషయం బాగా ట్రెండ్ అయ్యింది. అలా అయ్యాక అతడు ఒక పిరికివాడు అని ఆ స్టూడెంట్స్ తేల్చారు. ఆ విద్యార్థుల్ని ఈరోజు కామన్ పబ్లిక్ కూడా మెచ్చుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్. ఎందుకో గానీ ఇటీవల ఆర్జీవీని చానెళ్ల వాళ్లు పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. దీనర్థం ఆర్జీవీ కథ సగం ముగిసినట్టేనని చెవులు కొరుక్కుంటున్నారు ఫిలింనగర్ వాసులు. ఆర్జీవీ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాల్ని ఏకకాలంలో తెరకెక్కించేస్తున్నారు. ఇవన్నీ డిజిటల్ లేదా ఏటీటీ కోసమే. ఇవన్నీ వివాదాల్ని మోసుకొస్తున్నాయి. మరి రిలీజవుతాయా లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్..!









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాహుబలి ముందు `టైగర్` వెనుకడుగు!

ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు...మోదీ సర్కారు ఇచ్చే రుణంతో లక్షల్లో ఆదాయం...!!