బిగ్‌బాస్ సీజన్ 4లో ఈ సారి ఏయే మార్పులు ఉండబోతున్నాయంటే..!

 

కరోనా మహామ్మారి  కారణంగా ఈ సారి తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని బిగ్‌బాస్ లవర్స్ కాస్తంత అనుమానాలు వ్యక్తం చేసారు. తాజాగా ఈ షోలో భారీ మార్పులకు బిగ్‌బాస్ నిర్వాహకులు శ్రీకారం చుట్టారు.


  ఈ సారి తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని బిగ్‌బాస్ లవర్స్ కాస్తంత అనుమానాలు వ్యక్తం చేసారు. కానీ వారందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. అంతేకాదు షోను హోస్ట్ చేసే నాగార్జున కూడా బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రోమోలో కూడా పాల్గొన్నాడు. నాగార్జున నటించిన ఈ ప్రోమో త్వరలో ప్రసారం కానుంది. ఆ సంగతి పక్కనపెడితే.. కోవిడ్ 19 కారణంగా బిగ్‌బాస్ సీజన్ 4 ఉండబోదన్నది ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో బిగ్ బాస్ షో షూటింగ్‌ను ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున స్టార్ట్ చేసి.. 30 నుంచి రెగ్యులర్‌గా  ఈ షోను  ప్రసారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు స్టార్ మా నిర్వాహకులు. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్‌కు కరోనా టెస్టులు నిర్వహించి తర్వాత పూర్తిగా ఆరోగ్యం ఉన్నారని డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత హౌస్‌లో పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ సారి కంటెస్టెంట్స్‌కు ఆరోగ్య స్టార్ మా యాజమాన్యం స్పెషల్ కేర్ తీసుకోనున్నట్టు సమాచారం.


తాజగా ఈ సీజన్ కోసం నాగార్జునకు  స్టార్ మా యాజమాన్యం భారీగానే ముట్ట జెప్పబోతున్నట్టు సమాచారం . మొత్తంగా ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 2.5 కోట్ల వరకు ఛార్జ్ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా 10 వారాలకు గాను.. మొత్తంగా రూ. 50 కోట్ల వరకు నాగార్జునకు పారితోషకం ఇవ్వనున్నట్టు సమాచారం. దాంతో పాటు మరో రూ. 10 కోట్లు డాక్టర్లు, ఇతర ఖర్చుల కోసం ఇవ్వనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాహుబలి ముందు `టైగర్` వెనుకడుగు!

ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు...మోదీ సర్కారు ఇచ్చే రుణంతో లక్షల్లో ఆదాయం...!!